సోషల్ మీడియాలో వైరల్‌ గా మారిన సల్మాన్- వెంకీ డాన్స్

SMTV Desk 2019-03-26 11:22:31  salman khan, venkatess dance

టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేశ్ మొదటి కుమార్తె అశ్రిత వివాహం ఇటీవల జైపూర్‌లో జరిగింది. ప్రస్తుతం ఆ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కూడా ఈ వివాహ వేడుకల్లో పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సల్మాన్, వెంకటేశ్ డ్యాన్స్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. సల్మాన్ ఖాన్ నటించిన కిక్ సినిమాలోని జుమ్మే కీ రాత్ అనే పాటకు వెంకీ, సల్మాన్ కలిసి డ్యాన్స్ చేశారు. కాగా జైపూర్‌లో వివాహాన్ని పూర్తి చేసుకొని దగ్గుబాటి కుటుంబం హైదరాబాద్‌కు చేరుకుంది.