గాంధీ మెడికల్ హిస్టరీ : ఆ కాలంలో అనేక వ్యాధులతో పోరాడి గెలిచాడు

SMTV Desk 2019-03-25 18:47:28  mahathma gandhi, gandhi and health 150 years

మార్చ్ 25: జాతిపిత మహాత్మా గాంధీ 70 ఏళ్ల వయసులో ఉన్నా కూడా ఎంతో స్వాతంత్య్ర పోరాటంలో ఎంతో చురుకుగా పాల్గొని దేశానికి స్వాతంత్య్రం తేవడంలో కీలక పాత్ర పోషించారు. అయితే గాంధీ ఆ సమయంలో అనేక జబ్బులతో పోరాడి జీవించాడని తాజాగా ఓ బుక్ ద్వార వెలుగులోకి వచ్చింది. మహాత్మాగాంధీకి చెందిన హెల్త్ రికార్డులతో ధర్మశాలలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, దలైలామాలు ‘గాంధీ అండ్ హెల్గ్ @ 150’ అనే పుస్తకాన్ని విడుదల చేశారు. గాంధీ అందరిలాగానే అనారోగ్య సమస్యలతో బాధపడ్డారని ఈ పుస్తకంలో రాశారు. ఎన్నో ఏళ్ల పాటు ఆయన బీపీతో ఇబ్బంది పడ్డారని పేర్కొన్నారు. ఆయన లండన్‌లో ఉన్న సమయంలో ఛాతీలో మంటతో బాధపడేవారు. 1937-40 మధ్య కాలంలో చేయించుకున్న ఎలెక్ట్రో కార్డియోగ్రామ్ (ఈసీజీ) రికార్డుల ప్రకారం ఆయనకు గుండె సంబంధిత ఇబ్బందులు లేకపోయినప్పటికీ 1919లో పైల్స్, 1924లో అపెండిసైటిస్ ఆపరేషన్లు ఆయనకు జరిగాయి. ఆహారం విషయంలో తనపై తాను ప్రయోగాలు చేసుకోవడం.. దీర్ఘకాల ఉపవాసాల కారణంగా ఆయన ఆరోగ్యం చాలాసార్లు క్షీణించింది. కొన్ని సందర్భాల్లో మరణం అంచుల వరకు కూడా వెళ్లారు. ఐదడుగుల ఐదు అంగుళాల ఎత్తుతో వున్న ఆయన బరువు 46.7 కేజీలు. అయితే ఇది ఉండాల్సిన దానికన్నా తక్కువ బరువు అని తెలిపారు. 1925, 1936, 1944లలో గాంధీ మూడు సార్లు మలేరియా వ్యాధి బారిన పడ్డారు.