దీపికా పదుకునే ఛాలెంజింగ్ రోల్..!

SMTV Desk 2019-03-25 17:42:05  deepika padukone,

ఇన్నాళ్లు గ్లామర్ పాత్రల్లో అలరించి క్రేజ్ తెచ్చుకున్న దీపికా పదుకునే మొదటిసారి కెరియర్ లో స్పెషల్ రోల్ అది కూడా ప్రయోగాత్మకంగా చేసేందుకు సిద్ధమైంది. యాసిడ్ బాధితురాలు లక్ష్మి అగర్వాల్ జీవిత కథతో వస్తున్న సినిమా ఛపాక్ ఆ సినిమాలో దీపికా లీడ్ రోల్ చేస్తుంది. మేఘనా గుల్జర్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ఈరోజు రిలీజ్ చేశారు.

దీపికా పదుకునే లక్ష్మి అగర్వాల్ లుక్ లో యాసిడ్ దాడి జరిగిన మహిళ పాత్రలో కనిపిస్తున్నారు. సినిమా ఫస్ట్ లుక్ ఇంప్రెస్ చేసింది. యాసిడ్ దాడి వల్ల కుంగిపోకుండా ఎంతో పట్టుదలతో ఆత్మ విశ్వాసం పోగెసుకుని లక్ష్మి అగర్వాల్ తనలా యాసిడ్ దాడి జరిగిన మహిళలకు ఆసరాగా నిలుస్తుంది. ఆమె కథతో వస్తున్న ఈ సినిమాకు ఛపాక్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. సినిమా ఫస్ట్ లుక్ తో పాటుగా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. జనవరి 10న 2020లో ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేశారు.