వేర్వేరు ప్రదేశాల్లో ఘోర రోడ్డు ప్రమాదం...9 మంది మృతి

SMTV Desk 2019-03-25 17:26:09  new delhi road accident, bihar road accident

మార్చ్ 25: దేశ రాజధాని ఢిల్లీ, బీహార్ లో ఘోర రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో 9మంది మృతి చెందగా 15మందికి పైగా గాయపడ్డారు. పాట్నాలోని బారు-బక్తియార్పూర్ సమీపంలో ట్రక్కు, ఆటో ఢీకొని నలుగురు మృతి చెందగా.. 13మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందంటున్నారు వైద్యులు. ఇటు ఢిల్లీలో తెల్లవారుజామున ఓ ఏసీ బస్సుల్లో మంటలు చెలరేగాయి. ఢిల్లీ నుంచి బయలుదేరిన ఏసీ బస్సు ఆగ్రా -లక్నో ఎక్స్‌ప్రెస్ వేపై డివైడర్‌ ను ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఐదుగురు ప్రయాణికులు సజీవ దహనం కాగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.