భారత వైమానిక దళంలోకి చినూక్ హెలికాప్టర్లు

SMTV Desk 2019-03-25 16:32:48  chinuk helicopters

చండీఘడ్ : భారత వైమానిక దళంలో అమెరికా తయారు చేసిన చినూక్ భారీ హెలికాప్టర్లను ఇవాళ రంగంలోకి దించారు. భారత వాయుసేనకు చెందిన చండీఘడ్ వైమానిక కేంద్రంలో చినూక్ హెలికాప్టర్లను ప్రారంభించారు. ప్రపంచంలోని 19 దేశాలు వినియోగిస్తున్న చినూక్ హెలికాప్టర్లను తాము ప్రవేశపెట్టామని ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ థనోవా వెల్లడించారు. భారత వైమానిక కేంద్రాల్లో పెద్దఎత్తున సామాగ్రి, ఆయుధాలు, ఇంధనాన్ని తరలించడంతోపాటు విపత్తు సమయాల్లో వినియోగించుకునేందుకు ఇవి ఎంతో అనుకూలమైనవి ఆయన తెలిపారు. అమెరికాకు 1.5 బిలియన్లు చెల్లించి భారత్ 15 చినూక్ హెలికాప్టర్లను కొని కీలక ప్రాంతాల్లో మొహరించిందని ఎయిర్ చీఫ్ మార్షల్ చెప్పారు. దీంతోపాటు అపాచీ హెలికాప్టర్లను పఠాన్ కోట్ వైమానిక కేంద్రంలో ఉన్నాయని ఎయిర్ చీఫ్ వెల్లడించారు.