దేశీయ విక్రయాల్లో టాప్ లో మారుతి సుజుకీ 'ఆల్టో'

SMTV Desk 2019-03-23 16:41:06  maruthi suziki alto, maruthi suzuki

మార్చ్ 23: మారుతి సుజుకీకి చెందిన ఎంట్రీలెవల్‌ ఆల్టో అమ్మకాల్లో అగ్ర స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మ్యానుఫాక్చరర్స్‌(సియామ్‌) ఒక డేటాను విడుదల చేసింది. దీని ప్రకారం ఫిబ్రవరిలో 24,751 యూనిట్ల ఆల్టో కార్లు విక్రయమయ్యాయి. అంతేకాకుండా అధికంగా అమ్ముడైన వాహనాల్లో వరుసగా టాప్‌-6 వాహనాలు మారుతి సుజుకీ వాహనాలు ఉన్నట్లు సియామ్‌ తెలిపింది. మారుతి సుజుకీ తర్వాత రెండోస్థానంలో మారుతి హాచ్‌బ్యాక్‌ స్విఫ్ట్‌ నిలిచింది. ఫిబ్రవరిలో 18,224 యూనిట్ల స్విఫ్ట్‌ వాహనాలు అమ్ముడయ్యాయి. ఇదే కంపెనీకి చెందిన హాచ్‌బ్యాక్‌ బాలెనో(17,944 యూనిట్లు) మూడో స్థానంలో, డిజైర్‌(15,915 యూనిట్లు) నాలుగో స్థానంలో, వేగానర్‌ (15,661 యూనిట్లు) ఐదో స్థానంలో, విటారా బ్రెజా(11,613 యూనిట్లు) ఆరో స్థానంలో నిలిచినట్లు సియామ్‌ పేర్కొంది.