నిహారిక కోసం విజయ్ దేవరకొండ ..

SMTV Desk 2019-03-22 12:16:39  Vijay Devarakonda, Suryakantham

మెగా డాటర్ కొణిదెల నిహారిక ప్రధాన పాత్ర పోషిస్తున్న సినిమా ‘సూర్యకాంతం’. ఈ చిత్రం మార్చి 29 వ తేదీన విడుదల కాబోతున్నది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఇప్పటికే రిలీజ్ కాగా, అందరిని ఆకట్టుకుంది. ఇగో అండ్ డామినేషన్ ప్రధానాంశంగా సినిమా తెరకెక్కింది. సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మార్చి 23 వ తేదీన జెఆర్సీ కన్వెన్షన్లో భారీ ఎత్తున నిర్వహించబోతున్నారు. ఈ ఈవెంట్ కు అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండ చీఫ్ గెస్ట్ గా హాజరవుతున్నారు. నిహారిక సినిమాకు విజయ్ చీఫ్ గెస్ట్ గా హాజరవుతుండంతో అంచనాలు మరో స్థాయికి చేరుకున్నాయి. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే