బన్నీ కోసం చిరంజీవి హీరోయిన్

SMTV Desk 2019-03-22 12:10:06  Tabu, Allu arjun

స్టెలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రం కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ రాబోతుంది. హారిక హాసిని క్రియేషన్స్ తో పాటుగా గీతా ఆర్ట్స్ కూడా ఈ సినిమా నిర్మణంలో భాగస్వామ్యం అవుతుంది. త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతున్న ఈ సినిమాలో హీరో తల్లి పాత్రలో ఒకప్పటి హీరోయిన్ నగ్మా నటిస్తుందని అన్నారు. కాని నగ్మా ప్లేస్ లో ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ టబు నటిస్తుందని తెలుస్తుంది.

కూలీ నంబర్ 1 తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్ ను షేక్ చేసి ఆ తర్వాత బాలీవుడ్ షిఫ్ట్ అయిన టబు మళ్లీ తెలుగు సినిమాల్లో నటించాలని చూస్తుంది. ఇప్పటికే అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్ సినిమాలో టబు నటిస్తుందని వార్తలు రాగా ఇప్పుడు బన్ని సినిమాలో కూడా టబు ఉంటుందని తెలుస్తుంది. కొన్నాళ్లుగా తెలుగు తెరకు దూరంగా ఉంటూ వస్తున్న టబు రీ ఎంట్రీలో ఎలా అదరగొడుతుందో చూడాలి.