త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్న శ్రద్ధా!

SMTV Desk 2019-03-21 12:50:53  shradda kapoor, bollywood actress, marriage, saaho, bhagi 3, abcd

ముంబై, మార్చ్ 20: బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్నట్టు బీ-టౌన్లో విపరీతంగా టాక్ వినిపిస్తోంది. అయితే కొంతకాలంగా ఈ బ్యూటీ బాల్యస్నేహితుడు, ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ రోహన్ శ్రేష్టతో డేటింగ్ చేస్తుందని బాలీవుడ్ వర్గాల సమాచారం. దీంతో ఇప్పుడు రోహనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుందట శ్రద్ధా. ఈ బ్యూటీ వయసు 32. దీంతో ఇంట్లో వారు కూడా ఆమెను పెళ్లి చేసుకోమని అడుగుతున్నారంట. అందుకే ఇంట్లో వారికి రోహన్ గురించి చెప్పి పెళ్లికి ఒప్పించిందని తెలిసింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2020లో ఈ జంట పెళ్లిపీటలు ఎక్కడం ఖాయమని తెలుస్తోంది. ప్రస్తుతం శ్రద్ధా బాలీవుడ్ లో ‘చిచ్చోరే’, ‘బాఘీ 3’ ‘ఎబిసిడి 3’ చిత్రాలు చేస్తుంది. అలాగే తెలుగులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరన ‘సాహో’ సినిమాలో నటిస్తోంది.