ప్రియాంకాకు చేదు అనుభవం...

SMTV Desk 2019-03-21 12:07:31  priyanka gandhi, uttarpradesh, congress party, bjp, vindhyavyasi temple, narendra modi

లక్నో, మార్చ్ 19: కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది. అయితే తాజాగా ఆమెకు యూపీలో ఓ చేదు అనుభవం ఎదురైంది. వింద్యావాసిని దేవి ఆలయంలో పూజలు చేయడానికి వెళ్లిన ప్రియాంకను చూసి.. అక్కడున్న భక్తులు..మోదీ..మోదీ..అంటూ నినాదాలు చేశారు. దీంతో ఖంగుతిన్న ప్రియాంక గాంధీ వాద్రా దేవిని దర్శించుకొన్న వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయారు.