ఆమ్‌ ఆద్మీ పార్టీతో పొత్తు వల్ల కాంగ్రెస్‌కు తీవ్ర నష్టం....రాహుల్ కి షిలా దీక్షిత్‌ లేఖ

SMTV Desk 2019-03-20 16:07:04  Sheila Dikshit, rahul gandhi, congress party, aam admi party, loksabha elections

న్యూఢిల్లీ, మార్చ్ 19: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి పార్టీ సీనియర్‌ నేత షిలా దీక్షిత్‌ ఓ లేఖ రాశారు. ఆ లేఖలో ఢిల్లీలో ఆమ్‌ ఆద్మీ పార్టీతో పొత్తు వల్ల కాంగ్రెస్‌కు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందని అని రాసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అలాగే పొత్తుపై త్వరగా తేల్చాలని ఆమె కోరారన్నారు. లేదంటే పార్టీ కార్యకర్తల్లో గందరగోళ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. మరోవైపు పార్టీ సీనియర్ నేత కాంగ్రెస్ ఢిల్లీ ఇన్‌ఛార్జి పీసీ చాకో మాత్రం పొత్తుపై సానుకూలంగా ఉన్నారు బిజెపికి వ్యతిరేకంగా పోరాడుతున్న పార్టీలతో కలిసి వెళ్లాలన్నది కాంగ్రెస్‌ విధానం. ఈ మేరకు కాంగ్రెస్‌ వర్కింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం. దీనికి అనుగుణంగానే ఢిల్లీ నాయకులు నడుచుకోవాల్సి ఉంటుంది అని చాకో అభిప్రాయపడ్డారు. దీనిపై త్వరలో రాహుల్‌ గాంధీ నిర్ణయం తీసుకుంటారని ఆయన తెలిపారు.