మహిళ కాలేజీలో ప్రేమ పాఠాలు చెప్తూ ఉద్యోగం ఊడించుకున్న ప్రొఫెసర్ : వీడియో వైరల్

SMTV Desk 2019-03-20 13:41:51  Karnal Professor Teaching Romance in Women College, Women College, Professor , Teaching Romance

చంఢీగఢ్, మార్చ్ 19: హర్యానాలోని కార్నాల్ ప్రభుత్వ మహిళ కాలేజీలో ఓ సంఘటన చోటుచేసుకుంది. ఆ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉంటూ మ్యాథమేటిక్స్ ను బోధించేవాడు. కాని అతడు ఒకరోజు విద్యార్థినులకు మ్యాథ్స్ ఫార్మూలాలకు బదులు.. ప్రేమ ఫార్మూలాలను వివరించాడు. అంతే ఇక దెబ్బకు ఉద్యోగం ఊడింది. పూర్తి వివరాల ప్రకారం కళాశాలలో మ్యాథ్స్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్న చరణ్ సింగ్.. విద్యార్థినులకు గణితసూత్రాల బదులుగా ప్రేమ, సంబంధాల ఫార్మూలాలు బోధించాడు. ఆ సమయంలో తీసిన వీడియో ఒకటి నెట్టింట ప్రత్యక్షం కావడం.. అది కాస్తా వైరల్ గా మారడంతో చివరకు చరణ్ ఈ-మెయిల్ కు సస్పెన్షన్ లెటర్ వచ్చింది. ఇప్పుడీ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.