వెంకటేష్, రవితేజ కలిసి మల్టీస్టారర్ సినిమా

SMTV Desk 2019-03-20 13:16:26  Venkatesh, Raviteja,

హైదరాబాద్, మార్చ్ 19: తెలుగులో మల్టీస్టారర్ ట్రెండ్ కొనసాగిస్తున్న ఏకైక హీరో విక్టరీ వెంకటేష్ అని చెప్పొచ్చు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో క్రేజీ మల్టీస్టారర్ చేసిన వెంకీ ఆ తర్వాత పవన్ తో గోపాలా గోపాలా చేశాడు. రీసెంట్ గా వరుణ్ తేజ్ తో ఎఫ్-2 అంటూ సూపర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం నాగ చైతన్యతో వెంకీ మామా సినిమా చేస్తున్నాడు వెంకటేష్.

ఇక లేటెస్ట్ గా మరో క్రేజీ మల్టీస్టారర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట వెంకటేష్. బిందాస్ లాంటి కామెడీ ఎంటర్టైనర్ సినిమా చేసిన వీరు పోట్ల డైరక్షన్ లో వెంకటేష్, రవితేజ కలిసి ఓ మల్టీస్టారర్ సినిమా చేస్తారని తెలుస్తుంది. ఈ సినిమాను ఏ.కె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో అనీల్ సుంకర నిర్మిస్తున్నారని తెలుస్తుంది. 2016లో ఈడు గోల్డ్ ఎహే సినిమాతో డిజాస్టర్ అందుకున్న వీరు పోట్ల 3 ఏళ్లు గ్యాప్ తీసుకుని ఈ మల్టీస్టారర్ కథ సిద్ధం చేశాడట. వెంకటేష్, రవితేజ కాంబినేషనే అదిరిపోగా ఈ ఇద్దరు కలిసి చేసే ఆ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.