60 ఏళ్ల బామ్మగా ప్రముఖ హీరోయిన్

SMTV Desk 2019-03-18 12:48:00  Taapsee pannu, Old women, 60 years,

హైదరాబాద్, మార్చి 18: నటి తాప్సి ఝమ్మంది నాదం సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. అందంతో ఆకట్టుకున్న తాప్సి.. ఆ సినిమా తరువాత తెలుగులో అనేక హిట్ సినిమాలు చేసింది. తన టాలెంట్ తో బాలీవుడ్ లో అవకాశాలు దక్కించుకొని అక్కడ వరస సినిమాలు చేస్తూ బిజీ అయింది. ప్రస్తుతం అక్కడే ఎక్కువ సినిమాలు చేస్తోంది తాప్సి. పింక్, నామ్ షబానా, మన్మార్జియాన్ వంటి వరస హిట్స్ ను అందుకున్న తాప్సి, ఇప్పుడు మరో ప్రయోగాత్మక సినిమా చేసేందుకు సిద్ధం అయింది.

షార్ప్ షూటర్ చంద్రో తోమర్ జీవిత చరిత్ర ఆధారంగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో తాప్సి మెయిన్ లీడ్ రోల్ చేస్తున్నది. 60 సంవత్సరాల వయసులో చంద్రో తోమర్ అనేక పతకాలు సాధించి పేరు తెచ్చుకుంది. 60 సంవత్సరాల వయసులో జీవితంలో గెలవడం మామూలు విషయం కాదు… అలానే, 28 సంవత్సరాల అమ్మాయి 60 సంవత్సరాల వృద్దురాలిగా నటించడం అంటే కూడా మామూలు విషయం కాదు. ఆహార్యం, అభినయం అంతా వయసుకు తగ్గట్టుగా ఉండాలి. మరి ఈ పాత్రలో ఢిల్లీ బ్యూటీ ఎలా నటిస్తుందో చూడాలి.