అంతకు మించి...

SMTV Desk 2019-03-18 12:03:36  Raghava lawrence, kanchana, sequel movie,

హైదరాబాద్, మార్చి 18:హార ర్‌ చిత్రాల్లో రాఘవ లారెన్స్‌ రూపొందించిన ‘కాంచన’ సిరీస్‌కు స్పెషల్‌ క్రేజ్‌. ఇప్పుడు ‘కాంచన 3’ చిత్రాన్ని రెడీ చేసే పనిలో ఉన్నారాయన. లారెన్స్‌ నటిస్తూ, నిర్మించిన ఈ చిత్రంలో ఓవియా, వేదిక హీరోయిన్లు. ఈ చిత్రాన్ని నిర్మాత ‘ఠాగూర్‌’ మధు తెలుగులో రిలీజ్‌ చేయనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏప్రిల్‌ 19న ఈ మూవీ రిలీజ్‌ కానుంది.

లారెన్స్‌ మాట్లాడుతూ– ‘‘కాంచన 3’ చిత్రం నాకు ప్రత్యేకమైంది. కథ, కథనం, గ్రాఫిక్స్‌ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయి. గతంలో వచ్చిన ‘కాంచన’ చిత్రాలు బాగా అలరించాయి. ఈ సినిమా వాటిని మించి ఉంటుంది. సుమారు 220 రోజులు షూటింగ్‌ చేశాం. నా లుక్‌కు మంచి స్పందన వస్తోంది. తమన్‌ అద్భుతమైన రీరికార్డింగ్‌ అందిస్తున్నారు’’అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: వెట్రి, సర్వేష్‌ మురారి, సంగీతం: తమన్‌.