ఆమె రాకతో మాకేం నష్టం లేదు!

SMTV Desk 2019-03-16 18:41:46  priyanka gandhi, congress party, yogi adityanath, bjp, uttarpradesh chief minister

లక్నో, మార్చ్ 16: కాంగ్రెస్ పార్టీ ప్రధానకార్యదర్శిగా ప్రియాంకా గాంధీపై మొదటి సారి ఉత్తర ప్రదేశ్‌ సిఎం యోగి ఆదిత్యా నాథ్‌ కామెంట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఎస్‌పి, బిఎస్‌పి కూటములు కూడా తమ పార్టీని ఏమీ చేయలేవని ధీమా వ్యక్తం చేశారు. తూర్పు యుపికి ప్రియాంకను పార్టీ సెక్రటరీగా నియమించడం ఆ పార్టీ అంతర్గత విషయమని, గతంలో కూడా ప్రియాంక కాంగ్రెస్‌ తరఫున ప్రచారం చేశారని చెబుతూ.. ఇప్పడు ఆమె రాజకీయ ప్రవేశం వల్ల బిజెపికి ఎటువంటి ముప్పు లేదని సిఎం యోగి తెలిపారు. ఎస్‌పి, బిఎస్‌పి కూటములకు అప్పుడే కష్టాలు మొదలయ్యాయని అన్నారు. ఈ నెల 18న గంగా యాత్ర చేపట్టనున్న ప్రియాంక బోటు ద్వారా వారణాసి వరకు ప్రచారంలో పాల్గొననున్నారు.