క్రాస్ ఓటింగ్ భయంతో ఓటింగ్ ను రద్దు చేయమన్నారు

SMTV Desk 2017-08-08 19:29:26  NEW DELHI, RAJYASABA ELECTIONS, CONGRESS, BJP

న్యూఢిల్లీ, ఆగస్ట్ 8 : గుజరాత్ లో రాజ్యసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతు౦ది. ఈ ఎన్నికల్లో మొత్తం ఓటు హక్కు వినియోగించుకున్న సభ్యులు - 176. మూడు రాజ్యసభ స్థానాలకు నలుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. బీజేపీ అభ్యర్థులు అమిత్ షా, స్మృతి ఇరానీ విజయం దాదాపు ఖాయమైనట్టు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ ను మాత్రం క్రాస్ ఓటింగ్ భయం వెంటాడుతు౦ది. తమ బ్యాలెట్ పత్రాలను బీజేపీ ఎమ్మెల్యేలకు చూపించారని కాంగ్రెస్ ఆరోపిస్తూ ఇద్దరు ఎమ్మెల్యేలపై ఈసీకి ఫిర్యాదు చేయడమే కాక ఎన్నికలు రద్దు చేయాల౦టూ ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. కాగా కాంగ్రెస్ ఫిర్యాదును ఈసీ తోసిపుచ్చింది. కాగా కాసేపట్లో ఫలితాలు వెలువడనున్నాయి. అహ్మద్ పటేల్ విజయానికి 45 ఓట్లు అవసరం. ఎన్ సీపీ జేడీయూ కి చెందిన ఒక్కో ఎమ్మెల్యే, పటేల్ కి ఓటేసినట్లు తెలుస్తుంది. అయితే ఇద్దరు ఎమ్మెల్యేలు చివరి క్షణంలో ఫ్లేటు ఫిరాయించడంతో కాంగ్రెస్ హై కమాండ్ కలవరపడుతుంది. ఈ రాజ్యసభ ఎన్నికలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చాలా ధీమాతో ఉన్నట్లు తెలుస్తుంది.