2020 అండర్‌-17 ఉమెన్స్‌ వరల్డ్‌కప్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న భారత్

SMTV Desk 2019-03-16 17:41:30  2020 under 17 womens world cup, football, india

వాషింగ్టన్‌, మార్చ్ 16: 2020 అండర్‌-17 ఉమెన్స్‌ వరల్డ్‌కప్‌కు భారత్‌ ఆతిథ్యం ఇవ్వనున్నట్లు ఇంటర్నేషనల్‌ ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌ (ఫిఫా) అధ్యక్షడుడు గియానీ ఇన్‌ఫాంటినో ప్రకటించారు. ఫిఫా అండర్‌-17 ప్రపంచకప్‌ ఆతిథ్య హక్కులను తాజాగా భారత్‌ దక్కించుకున్నది. కాగా 2017లో అండర్‌-17 మెన్స్‌ వరల్డ్‌కప్‌ తర్వాత భారత్‌ ఆతిథ్యమిస్తున్న రెండో ఫిఫా టోర్నమెంటు ఇదే కావడం విశేషం. ఈ సందర్భంగా ఆల్‌ఇండియా ఫుట్‌ బాల్‌ ఫెడరేషన్‌ సెక్రటరీ కుశాల్‌ దాస్‌ మాట్లాడుతూ...ఉమెన్స్‌ ప్రపంచకప్‌ ఆతిథ్య హక్కులు తమకు ఇచ్చినందుకు ఫిఫాకు ధన్యవాదాలు. భారత్‌లో మహిళల ఫుట్‌బాల్‌ ప్రాచుర్యానికి ఈ టోర్నమెంటు ఎంతగానో ఉపయోగపడుతుందని కుశాల్‌ అభిప్రాయపడ్డారు.