అలియా రెమ్యూనరేషన్‌ ఎంతో తెలుసా

SMTV Desk 2019-03-16 12:32:14  Alia Bhatt, RRR,

హైదరాబాద్, మార్చ్ 16: దర్శక ధీరుడు రాజమౌళి నిర్మిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ మూవీ సెకండ్ షెడ్యూల్ షూటింగ్ స్పీడ్ గా జరుగుతున్నది. సెకండ్ షెడ్యూల్ పూర్తికాగానే.. యూనిట్ కోల్‌కతాకు షిఫ్ట్ అవుతుంది. సినిమాలో హీరోయిన్లు ఎవరు అనేది నిన్న విడుదల చేసాడు జక్కన్న. అలియా, హాలీవుడ్ హీరోయిన్ డైసీ ఎడ్గర్ జోన్స్ లు నటిస్తున్నట్లుగా వెల్లడించారు. ఇదిలా ఉంటె, బాలీవుడ్ లో అలియా భట్ ఫుల్ స్వింగ్ లో ఉంది. ‘గల్లీ బాయ్’ హిట్ తరువాత ఆమె బ్రహ్మాస్త్ర, కళాంక్ వంటి భారీ సినిమాల్లో నటిస్తోంది.

సౌత్ లో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించేందుకు గతంలో భారీ డిమాండ్ చేసిందని అందుకే ఆమెను పక్కన పెట్టారని వార్తలు వచ్చినా.. అవి నిజం కాదని నిన్నటితో తేలిపోయింది. బాలీవుడ్ లో ఈ భామ 7 నుంచి 10 కోట్ల రూపాయలు తీసుకుంటోంది.

ఆర్ఆర్ఆర్ సినిమా పాన్ ఇండియా సినిమా కావడంతో డిమాండ్… అలియా పారితోషికం మరింతగా పెంచినట్టు తెలుస్తోంది. ఈ సినిమా కోసం 10 నుంచి 15 వరకు డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. అడిగిన మొత్తాన్ని ఇచ్చేందుకు యూనిట్ ఒకే చేసినట్టు తెలుస్తోంది.