వరల్డ్‌ కిడ్నీ డే: మూత్రపిండాలను ఇలా కాపాడుకుందాం ...

SMTV Desk 2019-03-14 10:40:55  World Kidney Day,

ప్రతి ఒక్కరి శరీరంలో ప్రవహించే రక్తంలో ఉండే విషపదార్ధాలను శుద్ధి చేయడంలో మూత్రపిండాలు ముఖ్య పాత్రను పోషిస్తాయి. ఈ విషపదార్ధాలు శుద్ధిచేయడం అనే ప్రక్రియ చాలా క్లిష్టమైనది. ఈ విష పదార్ధాలన్నింటిని మూత్రం ద్వారా శరీరం నుండి బయటకు పంపివేయడం జరుగుతుంది.వరల్డ్‌ కిడ్నీ డేను ప్రతి ఏటా మార్చి 2వ గురువారం దీన్ని జరుపుకుంటారు. మూత్ర పిండాల పట్ల ప్రజల్ని జాగతం చేసే ఉద్దేశంతో ఇంటర్నేషనల్‌ నెఫ్రాలజీ సొసైటీ, ఇంటర్‌నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ కిడ్నీ ఫౌండేషన్‌లు సంయుక్తంగా వరల్డ్‌ కిడ్నీ డేను ఏటా నిర్వహిస్తున్నారు. కిడ్నీ వ్యాధులు గలవారికి ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకోవాల్సిన విధానాన్ని, జీవన ప్రమాణాల పెంపు గురించి, చికిత్సలు, జాగ్రత్తల గురించి ప్రజలకు వివరిస్తుంది.

మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే, మూత్రపిండాలు ఎల్లప్పుడూ చక్కగా పనిచేసేలా చూసుకోవాలి. ఎందుకంటే, అవి శరీరంలోని ఎలెక్ట్రోలైట్లు మరియు పోషకాలను సమతుల్యతతో ఉంచడమే కాకుండా, మరెన్నో పనులను కూడా సమర్ధవంతంగా నిర్వహిస్తాయి.

మూత్రపిండాలు చేసే పనిని ఒకసారి తెలుసుకుందాం.
1. రక్తంలో ఉన్న మలినాలని బయటికి తోడటం.
2. రక్తంలో ఉన్న విద్యుత్‌, రసాయన తుల్యతలను కాపాడటం.
3. విషతుల్య పదార్థాలను నాశనం చేసి విసర్జించటం.
4.రక్తంలోకి హర్మోనులను స్రవించి, తద్వారా శరీరంలోని కటికం మట్టాన్ని నిర్థిష్ట స్థాయిలో ఉంచడం.
5. శరీరానికి కావలసిన ఎర్ర కణాల ఉత్పత్తికి సహాయం చేసి రక్తహీనత రాకుండా కాపాడటం.

కానీ, అసలు సమస్య ఏమిటంటే, కొన్ని సమయాల్లో చెడ్డ అలవాట్ల వల్ల అవి చేయవల్సిన పనులు అవి చేయలేకపోతాయి. ఇందు వల్ల కొన్ని తీవ్రమైన సమస్యలు ఉత్పన్నమవుతాయి. అవి శరీర ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపిస్తాయి.

ఇప్పుడు మనం ఉల్లిపాయలతో కూడిన ఒక అద్భ్యుతమైన చిట్కాను తెలుసుకోబోతున్నాం. ఈ చిట్కా ద్వారా మూత్రపిండాలు ఎంతో శక్తివంతంగా తయారవుతాయి మరియు విషపదార్ధాలు శరీరం నుండి బయటకుపంపడం జరుగుతుంది.దీనిని అందరు ప్రయత్నించండి. ఉలిపాయల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. కొన్ని వందల సంవత్సరాలుగా శరీరం ఆరోగ్యంగా ఉండటానికి ఇవి ఎంతగానో దోహదపడుతున్నాయి. శుద్దీకరణ, యాంటీ బయోటిక్ మరియు మూత్రవర్ధకమైన శక్తులను మూత్రపిండాలకు ఇవి అందిస్తాయి. అంతే కాకుండా అవి దెబ్బతినకుండా ఒక సంరక్షించే అడ్డంకిని సృష్టిస్తాయి మరియు చెడ్డ పదార్ధాలను దూరం పెట్టి మరియు ఏవైతే హాని చేస్తాయో అటువంటి వాటిని బయటకు పంపించేస్తాయి.

ఉల్లిపాయల సమ్మేళనంలో అత్యంత ఉత్తేజకరంగా ఉండే పదార్ధం అల్లిసిన్. ఇది ఒక అత్యంత శక్తివంతమైన మంట విరుగుడు పదార్ధం మరియు చెడు పదార్ధాలను శుద్ధి చేయడంలో ఎంతో ప్రభావం కలిగినది. దీని వల్లనే మూత్రపిండాలు అవి ఎలా పనిచేయాలో ఆలా పనిచేస్తాయి. ముఖ్యంగా ఎప్పుడైతే శరీరంలో విషపదార్ధాలు పెరిగిపోతాయో అప్పుడు మూత్రపిండాలు బాగా పనిచేయడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. కిడ్నీలు శుభ్రపరచడానికి ఉల్లిపాయలు ఎలా ఉపయోగపడుతాయో తెలుసుకుందాం..