జోరు మీదున్న నాగ చైతన్య .. మరోసారి లవ్ స్టోరీ తో ..

SMTV Desk 2019-03-12 11:56:19  Naga Chaitanya, Love strory

హైదరాబాద్, మార్చ్ 12: టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో మజిలీ సినిమాతో ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అలాగే చైతు ప్రస్తుతం ‘వెంకీ మామ’ షూట్ లో పాల్గొంటున్నాడు. కాగా చైతు మరో టాప్ బ్యానర్ లో మరో సినిమా చేయబోతున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ లో చైతు సినిమా చేయబోతున్నాడు. డిసెంబర్ నుంచి ఈ సినిమా మొదలు కానుందని సమాచారం.

నాగ చైతన్య కోసం స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఓ మంచి లవ్ స్టోరీ రాస్తున్నారు. పాత ‘దేవదాస్’ కథ ఆధారంగా అంతటి గొప్ప విషాదాంతమైన ప్రేమ కథను చైతు కోసం రాశాడట విజయేంద్ర ప్రసాద్. ఇక ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారో ఇంకా తెలియాల్సి ఉంది. ఈ మధ్య వరుస ప్లాప్ లతో బాక్సాఫీస్ వద్ద కాస్త వెనుక పడిన చైతూకి శివ నిర్వాణ అన్నా ‘మజిలీ’తో మంచి హిట్ ఇస్తాడేమో చూడాలి.