ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ..

SMTV Desk 2019-03-12 07:26:56  NTR, RRR,

హైదరాబాద్, మార్చ్ 11: టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీ స్టారర్‌గా ఆర్ఆర్ఆర్ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈమూవీలో ఎన్టీఆర్ పాత్రకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.

ఎన్టీఆర్‌కు జోడీగా విదేశీ నటి ఈ చిత్రంలో కనిపించబోతున్నట్లు తాజా సమాచారం. ఆల్రెడీ ఆమె ఎంపిక కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. ఆ నటి పేరు బయటకు వెళ్లకుండా చిత్ర బృందం జాగ్రత్తలు తీసుకుంటోంది.ఈ మూవీ బ్రిటిష్ కాలం నాటి కథతో రూపొందుతోందని, ఎన్టీఆర్ బంధిపోటుగా కనిపించబోతున్నారని... ఈ క్రమంలో ఆయనతో రొమాన్స్ చేసే బ్రిటిష్ అమ్మాయి పాత్రలో విదేశీ నటి కనిపించబోతున్నట్లు ఫిల్మ్ నగర్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయం పై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు ..