మహేష్ సినిమాలో ప్రముఖ రాజకీయ నాయకురాలు

SMTV Desk 2019-03-12 07:17:00  Mahesh, vijaya santhi,

హైదరాబాద్, మార్చ్ 11: హ్యాట్రిక్ దర్శకుడు అనిల్ రావిపూడి తన తరువాత సినిమాను టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుతో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం అప్ డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మహేష్ అభిమానులు. కాగా జూలై నుండి ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లనుందని తెలుస్తోంది.

అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒక్కప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఓ కీలక పాత్రలో నటిస్తున్నారట, అలాగే కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కూడా ఓ పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక ప్రిన్స్ సరసన సెన్సేషనల్ హీరోయిన్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోందని ప్రస్తుతం వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని దిల్ రాజు తో కలిసి అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మించనున్నారు.