ఫాన్స్ ని నిరాశ పరిచిన రజినీకాంత్ ..

SMTV Desk 2019-03-11 12:36:29  Fans, rajinikanth,

2019 ఎన్నికల్లో రజినీకాంత్ పోటీ చేస్తారని గతంలో అనేక ఊహాగానాలు వచ్చాయి. రజిని మక్కల్ మంద్రం పార్టీని స్థాపించిన తరువాత ఈ ఊహాగానాలు మరింత ఎక్కువయ్యాయి. దేవుడు ఆదేశించాడు.. రజిని పాటిస్తాడు అని చెప్పిన రజినీకాంత్.. అనేకమార్లు తన పార్టీ కార్యకర్తలతో సమావేశాలు కూడా నిర్వహించారు.

సార్వత్రిక ఎన్నికల నగారా మోగబోతున్న తరుణంలో రజినీకాంత్ అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నాడు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించాడు. అంతేకాదు, తమిళనాడులో 21 నియోజక వర్గాలకు జరిగే బై ఎలక్షన్స్ లోను పోటీ చేయడం లేదని చెప్పాడు. దీంతో అభిమానులు, తమిళ ప్రజలు నిరాశ చెందారు.