వెంకయ్య నాయుడిపై ట్వీట్ చేసినందుకు కన్నడ నటుడికి తిట్లు

SMTV Desk 2017-08-07 14:22:34  VENKAYYA NAYUDU, KANNADA ACTER JAGGESH, TWITTER.

ఢిల్లీ, ఆగస్ట్ 7 : కన్నడ నటుడు జగ్గేష్ చేసిన ట్విట్ పెద్ద విమర్శలకు దారి తీసింది. ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించనున్న వెంకయ్యనాయుడిపై ఆయన చేసిన వ్యాఖ్యలు కన్నడిగులను అవమానించేలా ఉన్నాయంటూ, నెటిజన్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తపరుస్తూ తిట్ల వర్షం కురిపించగా తన ట్వీట్ ను తొలగించాల్సి వచ్చింది. గతంలో వెంకయ్య నాయుడిని కర్ణాటకకు చెందని వ్యక్తిగా రాష్ట్రం నుంచి రాజ్యసభకు పంపడంపై ప్రజలు ఆందోళన చేశారని, ఇప్పుడదే వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతిగా ఎంపికయ్యారని జగ్గేష్ ట్వీట్ చేయడంతో ఆగ్రహానికి గురైన పలువురు జగ్గేష్ పరోక్షంగా ప్రజలను అవమాని౦చాడని విమర్శించారు. అయితే గతంలో బీజేపీ కన్నడిగుడు కాని వెంకయ్య నాయుడును రాష్ట్రం నుంచి రాజ్యసభకు పంపాలని నిర్ణయించుకోవడంతో తీవ్ర నిరసనలు వ్యక్తం కాగా తన నిర్ణయాన్ని మార్చుకున్న విషయం తెలిసిందే.