‘వెంకీమామ’ గురించి పాయల్ ఫీలింగ్ ఇది!

SMTV Desk 2019-03-11 08:42:29  Payal rajput, Venkatesh, Nagachaitanaya

హైదరాబాద్, మార్చి 11: ఆర్ ఎక్స్ 100 తో టాలీవుడ్ ని ఫిదా చేసిన హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌. అవ్వడానికి మొదటి సినిమా అయిన నటనలో మంచి మార్కులే కొట్టేసింది ఈ భామ. ప్రస్తుతం వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా కేఎస్‌. రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వెంకీమామ’ చిత్రంలో ఆమె నటిస్తుంది. ఇందులో వెంకీ సరసన పాయల్‌ రాజ్‌పుత్, నాగచైతన్యకు జోడీగా రాశీఖన్నా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ ఇటీవల గోదావరి జిల్లాల పరిసర ప్రాంతాల్లో మొదలైన విషయం తెలిసిందే. వెంకీ, నాగచైతన్యలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇటీవల రాశీఖన్నా, పాయల్‌ రాజ్‌పుత్‌ సెట్‌లో జాయిన్‌ అయ్యారు. కొత్త తెలుగు సినిమా షూటింగ్‌లో పాల్గొనడం తనకు చాలా ఎగ్జైటింగ్‌గా ఉందన్నారు పాయల్‌.