సోనాక్షి సిన్హాపై అరెస్ట్ వారెంట్ పై హైకోర్టు స్టే

SMTV Desk 2019-03-11 07:30:06  Allahabad HC stays Sonakshi Sinha s arrest in cheating case, declines her plea to quash the FIR, Sonakshi Sinha, bollywood actress

ముంబై, మార్చ్ 10: బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హాపై దాఖలైన పిటిషన్‌పై అలహాబాద్ హైకోర్టు శనివారం స్టే ఇచ్చింది. మొరాబాద్‌కు చెందిన ఓ ఆర్గనైజర్ సోనిక్షాపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే, దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. దర్యాప్లు జరుగుతున్న సమయంలో ఎలాంటి వేధింపులు, ఇబ్బందులుకు గురిచేయొద్దనే ఉద్దేశంతో స్టే విధిస్తున్నట్లు కోర్టు వివరించింది. గతేడాది సెప్టెంబర్ 30వ తేదీన ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు సోనాక్షి రూ.37 లక్షలు తీసుకుంది. చివరి నిమిషంలో ఆ కార్యక్రమానికి రాకపోవడంతో సదరు ఈవెంట్ ఆర్గనైజర్ ప్రమోద్ శర్మ నవంబర్ 24న సోనాక్షితో పాటు మరో ఐదుగురిపై చీటింగ్ కేసు పెట్టాడు. సోనాక్షి ఈవెంట్‌కు హాజరు కాకపోవడంతో తనకు భారీ నష్టం వాటిల్లిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ కేసుని విచారించిన న్యాయమూర్తి సోనాక్షి అరెస్ట్‌పై స్టే విధిస్తున్నట్లు తెలిపారు.