మజిలీ టీజర్ కొత్త రికార్డు ...

SMTV Desk 2019-03-10 15:00:47  Nagachaitanya, Samantha,

హైదరాబాద్, మార్చి 10: టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య, సమంతల కాంబినేషన్ లో శివ నిర్వాణ డైరెక్షన్ లో రూపొందిన చిత్రం మజిలీ, ఇటీవలే ఈ సినిమా టీజర్ విడుదలై అందరిని ఆకట్టుకుంటుంది. పెళ్ళైన తర్వాత సమంత, నాగ చైతన్యలు కలిసి నటిస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై రూపొందిన ఈ చిత్రం లో దివ్యాంక కౌశిక్ మరో హీరోయిన్ గా నటిస్తోంది. ఏప్రిల్ 4న ఈ సినిమా రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది సినిమా యూనిట్, క్రికెట్ నేపథ్యంలో సాగే ఈ సినిమాకు గోపి సుందర్ స్వరాలూ సమకూర్చారు.

ఇక మజిలీ టీజర్ కు యూట్యూబ్ లో మంచి ఆదరణ లభిస్తోంది, ఈ క్రమంలో నాగచైతన్య, సమంతల జంట ఈ టీజర్ ద్వారా 200k లైక్స్ దిశగా సాగుతోంది. సింగిల్ ఛానల్ లో ఇన్ని లైకులు రావటం అక్కినేని ఫ్యామిలీకి ఇదే తొలిసారి అవుతుంది. ప్రస్తుతం మజిలీ టీజర్ కు 198k లైక్స్ ఉన్నాయి, అంటే త్వరలోనే 200k లైక్స్ రీచ్ అవ్వటం ఖాయం అన్నమాట. ఈ మధ్య సరైన హిట్ లేక వెనకబడ్డ నాగచైతన్యకు పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా ఏ మేరకు హిట్ ఇస్తుందో చూడాలి.