కార్తీ తో జ్యోతిక .. ..!

SMTV Desk 2019-03-10 14:16:34  Jyotika, Jeetu josef,

హైదరాబాద్, మార్చి 10: టాలీవుడ్ లో ఓ క్రేజీ కాంబినేషన్ లో చిత్రం రాబోతుంది. కార్తి హీరోగా మళయాల దర్శకుడు జీతూ జోసెఫ్ డైరక్షన్ లో ఓ చిత్రం వస్తుంది. ఈ సినిమాలో కార్తికి జోడీగా ఎవరు నటిస్తారో తెలియాల్సి ఉంది. అయితే సినిమాలో కార్తితో పాటుగా ఓ క్యూషియల్ రోల్ లో జోతిక నటిస్తుందని తెలుస్తుంది. మదిరి సినిమాలో జ్యోతిక నటించడం ఇదే మొదటిసారి. చిత్రం లో జ్యోతిక పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుందట అందుకే ఆమె ఒప్పుకుందని తెలుస్తుంది.

ఈమధ్యనే సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన జ్యోతిక తనకు నచ్చిన పాత్రలను చేస్తూ వస్తుంది. ఇక కార్తి ప్రస్తుతం ఖైది సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత భాగ్యరాజ కన్నన్ డైరక్షన్ లో మరో సినిమా లైన్ లో పెట్టాడు. ఈ రెండు సినిమాలు పూర్తి అయ్యాకనే జీతు జోసెఫ్ చిత్రం సెట్స్ మీదకు వెళ్తుందట. జీతు జోసెఫ్ తమిళంలో కమల్ హాసన్ తో పాపనాశం సినిమా చేశాడు. మరి కార్తి తో ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి.