ఆర్య‌-సాయేషా సంగీత్ లో సందడి చేసిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్

SMTV Desk 2019-03-10 12:48:49  Stylish star, sayyesha

హైదరాబాద్, మార్చ్ 10: తమిళ నటుడు ఆర్య‌(38), నటి స‌యేషా సైగ‌ల్‌(21)ల వివాహం నేడు హైద‌రాబాద్‌లో ఘ‌నంగా జ‌ర‌గ‌నున్న సంగ‌తి తెలిసిందే. మూడు రోజుల నుండి వీరి వివాహా కార్య‌క్ర‌మాలు మొదలైనాయి. శుక్ర‌వారం జ‌రిగిన ప్రీ వెడ్డింగ్ వేడుక‌కి బాలీవుడ్ సెల‌బ్రిటీలు సంజ‌య్ ద‌త్‌, ఖుషీ క‌పూర్‌, ఆదిత్యా పంచోలితో పాటు ప‌లువురు సెల‌బ్రిటీలు హాజ‌ర‌య్యారు. శనివారం జరిగిన సంగీత్ వేడుక‌ కార్యక్రమానికి టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హాజ‌ర‌య్యారు. ఆర్య‌,సాయేషాతో క‌లిసి బ‌న్నీ దిగిన ఫోటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .