ఈ వారం సినిమా ముచ్చట్లు

SMTV Desk 2019-03-10 12:05:14  Tamanna , movie news,

హైదరాబాద్ మార్చి10: టాలీవుడ్ తమన్నా, ప్రభుదేవా కలసి నటించిన దేవి 2 సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం వచ్చే నెల 12న విడుదల చేస్తారు. ఈ చిత్రం షూటింగ్ మొత్తం మారిషస్ లో జరిగింది.

* ప్రస్తుతం మజిలి , వెంకీమామ చిత్రాలలో నటిస్తున్న అక్కినేని నాగ చైతన్య త్వరలో మరో ప్రేమకథా చిత్రంలో నటించనున్నాడు. గత కొన్నాళ్లుగా సక్సెస్ కి దూరంగా వున్న ప్రముఖ దర్శకుడు దశరథ్ దీనికి దర్శకత్వం వహిస్తాడని సమాచారం.


* ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి అప్పుడప్పుడు కొన్ని చిత్రాలలో పాటలు పాడుతుండడం మనకు తెలిసిందే. అలాగే తాజాగా అడవి శేష్ హీరోగా రూపొందుతున్న ఆపరేషన్ గోల్డ్ ఫిష్ చిత్రంలో కీరవాణి ఓ పాట పాడారు. సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల సారథ్యంలో ఈ పాటను రికార్డు చేశారు.