రాజ్ తరుణ్ తో రానా దగ్గుబాటి..!

SMTV Desk 2019-03-10 09:45:26  Raj Tharun, rana daggubati,

కుమారి 21ఎఫ్ సినిమాతో రాజ్ తరుణ్ క్రేజ్ తెచ్చుకోగా దాన్ని కాపాడుకోవడంలో మాత్రం వెనుకపడ్డాడు. లాస్ట్ ఇయర్ వచ్చిన లవర్ సినిమా కూడా నిరాశపరచడంతో రాజ్ తరుణ్ కెరియర్ సంక్షోభంలో పడింది. అయితే రానా దగ్గుబాటి రూపంలో అతనికి అదృష్టం కలిసి వచ్చింది. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, రానా దగ్గుబాటి కలిసి ఓ సినిమా నిర్మిస్తున్నారు. తెలుగు, హింది భాషల్లో తెరకెక్కించబోతున్న ఈ సినిమాలో తెలుగు హీరోగా రాజ్ తరుణ్ ను సెలెక్ట్ చేశారట.

రానా ప్రొడక్షన్ లో రాజ్ తరుణ్ సినిమా అంటే కెరియర్ కు కావాల్సినంత బూస్టప్ దొరికినట్టే. కథ కూడా కొత్తగా ఉంటుందని తెలుస్తుంది. దర్శకుడు ఎవరు మిగతా స్టార్ కాస్ట్ ఎవరన్నది మరికొద్దిరోజుల్లో తెలుస్తుంది. మొత్తానికి రాజ్ తరుణ్ రానా ఆఫర్ తో మరోసారి వార్తల్లో నిలిచాడు ఈ సినిమా సక్సెస్ అయితే మళ్లీ రాజ్ తరుణ్ కు మంచి రోజులు వచ్చినట్టే లెక్క.