మహిళా దినోత్సవ ఆఫర్లు

SMTV Desk 2019-03-09 13:05:03  Womensday, Bikes, cars

న్యూఢిల్లీ, మార్చ్ 09: : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మారుతి సుజుకీ ఇండియా, హుందయ్, రెనో ఇండియా వంటి వాహన సంస్థలు ప్రత్యేక , ఆకర్షనియమైన ఆఫర్లను ప్రకటించాయి. మారుతి సుజుకీ తన మహిళా కస్టమర్లకు మార్చి 8 నుంచి మార్చి 31 వరకు పలు ఆఫర్లను అందిస్తున్నట్లు వెల్లడించింది.

కాంప్లిమెంటరీ సర్వీస్ వోచర్స్, లేబర్ ఛార్జీలు, విడి భాగాలు, యాక్సెసరీస్‌పై డిస్కౌంట్స్ అందిస్తున్నట్లు ప్రకటించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల పట్ల మా విధేయత, కృతజ్ఞత చాటుకునేందుకు గాను వివిధ సేవలపై డిస్కౌంట్స్ అందిస్తున్నామని మారుతి సుజుకీ ఇండియా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(సర్వీసెస్) పార్తో బెనర్జీ తెలిపారు .

గత ఏడాది 18,000 మంది మహిళలు సర్వీస్ క్యాంపుల్లో పాల్గొన్నారని, ఈ మధ్యకాలంలో మహిళలే స్వయంగా సర్వీస్ సెంటర్‌కు వాహనాలు తీసుకొస్తున్నారని అన్నారు. మరో సంస్థ రెనో ఇండియా కూడా తన మహిళా కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్లను అందిస్తోంది. మార్చి 6 నుంచి మార్చి 11 వరకు వివిధ రకాల ప్రోత్సాహకాలు ప్రకటించింది. అలాగే విడిభాగాలు, యాక్సెసరీస్, లేబర్ ఛార్జీలు, వ్యాల్యూ యాడెడ్ సర్వీసులపై 10 శాతం డిస్కౌంట్ కూడా ప్రకటించింది.