‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ రిలీజ్ కి వర్మ వేసిన ప్లాన్ 'బి' ఏంటో తెలుసా ?

SMTV Desk 2019-03-09 12:53:15  Laksmis NTR, Varma

హైదరాబాద్, మార్చ్ 09: : ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ జీవితంపై ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం తెరకెక్కుతుంది. అయితే, ఈ చిత్రం త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో వర్మ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఎలాంటి అడ్డంకులు లేకుండా విడుదల అవుతుందని మీరు భావిస్తున్నారా.? అని మీడియా అడిగిన ప్రశ్నకు కొంచెం గడుసుగానే జవాబిచ్చారు.

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా రిలీజ్ కాకుండా ఎవ్వరూ ఆపలేరని వర్మ తేల్చిచెప్పారు. ఒకవేళ సినిమా ఆపాలనుకుంటే తనను చంపేయాలన్నారు. అలాంటిది ఏదైనా జరిగితే దానికి కూడా ఇంకో మార్గం ఆలోచించి పెట్టానని వర్మ పేర్కొన్నారు. ‘ఓ హార్డ్ డిస్క్ లో అంతా వుంచి, నాకేమైనా అయితే ఇందులో వున్న కంటెంట్ అంతా యూట్యూబ్ లో అప్ లోడ్ చేయాలని చీటీరాసి పెట్టానని చెప్పారు. అందువల్ల దీన్ని బయటకు రాకుండా అయితే ఎవ్వరూ ఆపలేరు’ అని వర్మ తెలిపారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను మార్చి 22న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు నిర్మాతలు సన్నాహాలు చేసుకుంటున్నారట.