మహేష్ అభిమానులకు గుడ్ న్యూస్

SMTV Desk 2019-03-09 11:59:02  Mahesh Babu,

హైదరాబాద్, మార్చ్ 09: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ అభిమానులుకు ఇప్పుడు గుడ్ టైం స్టార్ట్ అయ్యిందా అంటే అవుననే అనిపిస్తుంది.ఈ మధ్యనే అన్ని సస్పెన్సులకి తెర దించుతూ అధికారిక విడుదల తేదీని ఖరారు చేసేసారు.అలాగే గత కొన్ని రోజుల క్రితమే మహర్షి టీజర్ కోసం అప్డేట్ కావాలంటూ ట్విట్టర్లో మహేష్ అభిమానులు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.

ఇక సినిమా విడుదలకు కూడా సమయం దగ్గర పడుతుండడంతో ఇన్నాళ్లు లేట్ చేసిన వంశీ టీమ్ ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ అప్డేట్స్ వదలాల్సిందే..దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆడియో కోసం ఇప్పుడు ఒక వార్త బయటకు వచ్చింది.ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్ సింగల్ లిరికల్ పాటను ఈ నెల 21 న విడుదల చిత్ర యూనిట్ డేట్ ఫిక్స్ చేసారని సమాచారం.ఈ సినిమాలో పూజా హెగ్డే మహేష్ సరసన హీరోయిన్ గా నటిస్తుండగా అల్లరి నరేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు.వచ్చే మే నెల 9 న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.