కొత్త సిరీస్‌ నాణేలను విడుదల చేసిన కేంద్రం

SMTV Desk 2019-03-09 10:22:41  Central, new coins

కొత్త సిరీస్‌ నాణేలను కేంద్రం విడుదల చేసింది. రూ. 1, రూ. 2, రూ. 5, రూ. 10, రూ. 20 నాణేలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ విడుదల చేశారు. ముఖ్యంగా దృష్టి లోపం ఉన్నవారు గుర్తుపట్టేలా ప్రత్యేక డిజైన్‌ తో వీటిని రూపొందించారు. 27 మిల్లీ మీటర్ల వ్యాసం కలిగిన 20 రూపాయల కాయిన్‌.. డోడెకాగన్‌ రూపంలో ఉంటుంది. 10 రూపాయిల కాయిన్‌ లాగానే 20 రూపాయిల కాయిన్‌ కూడా రెండు రకాల రంగుతో ఉంటుంది. దీనికి 12 అంచులు ఉంటాయి. మిగతా నాణేలు రౌండ్‌ షేప్‌లోనే ఉండనున్నాయి.