భారత్ పోరాడి ఓడిపోయింది.. మూడో వన్డే ఆసీస్‌దే

SMTV Desk 2019-03-09 10:19:59  Ranchi, Virat Kohli,

రాంచీ: రాంచీ వన్డేలో భారత్ పోరాడి ఓడిపోయింది. 314 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ అన్ని వికెట్లు కోల్పోయి 281 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో భారత్ 32 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. విరాట్ (123) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. విరాట్‌కు మిగతా బ్యాట్స్‌మెన్ల నుంచి సహకారం లేకపోవడంలో భారత జట్టు ఓటమిని మూటగట్టుకుంది. విరాట్ వన్డేలో 41వ సెంచరీ చేశాడు. విజయ శంకర్(32), ధోనీ(26), జాధవ్(26), రవీంద్ర జడేజా (24), రోహిత్ శర్మ(14), షమీ(8), ధావన్(2), రాయుడు(2) కులదీప్ యాదవ్(10), బుమ్రా(0) నాటౌట్ పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో జంపా, రిచర్డ్ సన్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా కమ్నీస్ రెండు వికెట్లు, లయాన్ ఒక వికెట్ తీశాడు. మ్యాన్ ఆప్ ది మ్యాచ్ అవార్డు ఖవాజాకు (104) వరించింది. ఐదు వన్డేల సిరీస్ లో భారత్ 2-1 తేడాతో ఆధిక్యంలో ఉంది.