కమల్ హసన్ ఎంఎన్‌ఎం పార్టీలో చేరిన కోవై సరళ

SMTV Desk 2019-03-09 09:48:36  kamal hasan, kovai sarala, kovai sarala join into mnm party

చెన్నై, మార్చ్ 08: విలక్షణ నటుడు కమల్ హసన్ స్థాపించిన మక్కల్‌ నీది మయ్యం( ఎంఎన్‌ఎం) పార్టీలో ఈ రోజు ప్రముఖ హాస్య నటి కోవై సరళ చేరారు. పార్టీ అధినేత కమల్ హసన్ కోవై సరళకు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. తరువాత చెన్నైలోని పార్టీ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఎంఎన్‌ఎం సభ్యత్వాన్ని కోవై సరళకు అందజేశారు. ఈ సందర్భంగా కోవై సరళ మాట్లాడుతూ.. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో ఎంఎన్ఎం తరఫున ప్రచారం చేస్తానని తెలిపారు. పార్టీ విజయం కోసం కృషి చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. అనంతరం కమలహాసస్ స్పందిస్తూ.. కోవై సరళ సేవలు ప్రస్తుతం పార్టీకి అవసరమని అన్నారు. మక్కల్ నీది మయ్యం బలోపేతానికి ఆమె సహకారం తీసుకుంటామని తెలిపారు. కాగా, కోవై సరళ చేరిక నేపథ్యంలో కోయంబత్తూరు, కొంగునాడు ప్రాంతాల్లో పార్టీకి లబ్ధి చేకూరుతుందని ఎంఎన్ఎం వర్గాలు భావిస్తున్నాయి. కమల్‌హాసన్‌ తెలిపారు.