ప్రభాస్ పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన కృష్ణం రాజు సతీమణి

SMTV Desk 2019-03-08 16:15:21  Prabhas,

హైదరాబాద్, మార్చ్ 08: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సాహో సినిమాతో బిజీ ఉన్నాడు.. అయితే అభిమానులు ప్రభాస్ పెళ్లి ఎపుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు .. ఈ నేపథ్యం లో కృష్ణంరాజు శ్రీమతి శ్యామలాదేవి తాజా ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ సమయంలోనే ప్రభాస్ పెళ్లికి సంబంధించిన ప్రస్తావన రావడంతో ఆమె స్పందించారు.

"ప్రభాస్ పెళ్లికి సంబంధించి ఇంతవరకూ వచ్చిన వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదు. ప్రభాస్ పెళ్లికి సంబంధించి వస్తోన్న పుకార్లను మేము సరదాగా తీసుకుంటామేగానీ .. పెద్దగా పట్టించుకోము. ప్రస్తుతం ప్రభాస్ రెండు సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలను పూర్తిచేయగానే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. మాది చాలా పెద్ద కుటుంబం .. అందరం కలిసిపోయి ఎంతో ఆప్యాయంగా ఉంటాము. అలా మా అందరిలో కలిసిపోయే అమ్మాయే ప్రభాస్ కి భార్యగా రావాలని మేమంతా కోరుకుంటున్నాము. అలాంటి అమ్మాయే వస్తుందని మేమంతా ఆశిస్తున్నాము"అంటూ చెప్పుకొచ్చారు.