వారు ఇచ్చే స్ఫూర్తి దైర్యాన్ని ఇస్తుంది.. రాబర్ట్ వాద్రా

SMTV Desk 2019-03-08 13:41:41  Robert Vadra, Womens Day Wishes, ED, Money Laundering Case

న్యూఢిల్లీ, మార్చి 8: ప్రముఖ వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా ట్విట్టర్ వేదికగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పలు వ్యాఖ్యలు చేశారు. తన చుట్టూ నలుగురు బలమైన మహిళలు ఉన్నారని, వారు ఇచ్చే స్ఫూర్తి తనకు దైర్యాన్ని ఇస్తుందని వ్యాఖ్యానించారు. తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టిన ఆయన, తన తల్లి, అత్త, భార్య, కుమార్తెలు తన చుట్టూ ఉన్నంత కాలం, తనకెంతో సంతోషమని అన్నారు. "నేడు మాత్రమే కాదు. ప్రతిరోజూ మనదే. మీ కలలను నెరవేర్చుకునేందుకు ఇండియా సురక్షితమైన, ప్రోత్సాహవంతమైన దేశంగా మారుతుందని ఆశిస్తున్నాను" అని ట్వీట్ చేశారు. అలాగే, "ఈడీ విచారణ పూర్తి కాగానే ఇంటికివెళ్లి వారితో నేను సెలబ్రేట్ చేసుకుంటాను. ఇప్పటికే 10 రోజుల్లోని 64 గంటల సమయం వృథా అయింది. విచారిస్తున్న వారికి సహకరిస్తున్నా. నిజం నావైపుంది. న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా" అని అన్నారు. "ఎంతో మంది మహిళలు తమ హక్కుల కోసం పోరాడుతున్నారు. వారంతా విజయం సాధించాలి. వ్యాపార, ఆర్థిక రంగాల్లో, క్రీడల్లో, సైన్స్ లో మహిళలు గెలవాలి" అన్నారు. ప్రస్తుతం రాబర్ట్ వాద్రా మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.