కరుణానిధి మనవరాలికి ఎదురుదెబ్బ, నాన్‌బెయిల్‌బుల్‌ వారెంట్‌ జారీ

SMTV Desk 2019-03-08 12:12:00  Karunanidi, Anjugaselvi, Arrest, Non Bailable Warranty, IT Returns, Court Case

చెన్నై, మార్చి 8: తమిళ నాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత కరుణానిధి మనవరాలు అంజుగ సెల్వి గత కొంత కాలంగా ఐటీ రిటర్న్స్ చెల్లించకపోవడంతో, ఐటీ శాఖ అధికారులు పిర్యాదు చేశారు. ఈ మేరకు కేసును పరిశీలించిన కోర్ట్ నాన్‌ బెయిల్‌బుల్‌ వారెంటు జారీ చేసింది. ఈ సందర్భంగా కోర్ట్ అంజుగ సెల్వి ని అరెస్ట్ చెయ్యాలని ఆదేశించింది.

కరుణానిధి పెద్ద కుమారుడు అళగిరి కుమార్తె అయిన అంజుగ సెల్వి 2009-10 సంవత్సరానికి సంబంధించిన రిటర్న్స్ దాఖలు చేయలేదు. ఆమె దాదాపు 70 లక్షల రూపాయల పన్ను చెల్లించాల్సి ఉండడంతో, ఇందుకు ఆదాయ పన్ను శాఖ అధికారులు ఎగ్మూర్‌లోని అడిషనల్‌ చీఫ్‌ మ్యాజిస్ర్టేట్‌ కోర్డులో కేసు వేశారు.