అజారుద్ధీన్ కొడుకు అసద్ తో సానియా మిర్జా చెల్లి అనం పెళ్లి

SMTV Desk 2019-03-08 11:35:57  azharuddin, asad, sania mirza, anam mirza, asad anam marriage

ముంభై, మార్చ్ 07: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజారుద్ధీన్ తనయుడు అసద్ వివాహం ప్రముఖ క్రీడాకారిణి సానియా మిర్జా చెల్లెలు అనం మీర్జాతో జరగనుంది. ఆనమ్‌ మిర్జా 2016లో అక్బర్‌ రషీద్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తన మాజీ భర్త అక్బర్ రషీద్‌ నుంచి గతేడాది ఆనమ్ విడాకులు కోసం దరఖాస్తు చేసుకోగా.. ఈ మధ్యే వారికి విడాకులు మంజూరు అయినట్లు సమాచారం. ఇక అసద్, అనంల ఇన్‌స్టాగ్రమ్ అకౌంట్లలో కనిపిస్తున్న కొన్ని పోటోలను చూస్తుంటే వీరి నిఖా పక్కా అయినట్లే తెలుస్తుంది. మీడియా కథనాలు, ఇరు కుటుంబాలకు చెందిన సన్నిహిత వ్యక్తుల సమాచారం ప్రకారం అసద్, ఆనమ్ ప్రేమలో ఉండగా వారి కుటుంబాలు కూడా వీరి పెళ్లికి ఒప్పుకున్నట్లు చెబుతున్నారు. అయితే, వాళ్ల కుటుంబాలు మాత్రం ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించలేదు. ఈ ఏడాది ఆఖరిలో ఇద్దరూ పెళ్లి చేసుకోనునట్లు తెలుస్తోంది.