ఫోక్స్‌వ్యాగన్‌కు రూ. 500కోట్ల జరిమానా

SMTV Desk 2019-03-07 15:53:53  Volkswagen, environmental securities, harita tribunel, National Green Tribunal Act

న్యూఢిల్లీ, మార్చ్ 07: ఆటోమొబైల్‌ సంస్థ ఫోక్స్‌వ్యాగన్‌కు కేంద్రం గట్టి షాక్ ఇచ్చింది. జర్మనీకి చెందిన ఈ సంస్థ పర్యావరణానికి హానీ కలిగించినందుకు గానూ జాతీయ హరిత ట్రైబ్యూనల్‌ రూ. 500కోట్ల జరిమానా విధించింది. అయితే రెండు నెలల్లోగా ఈ మొత్తాన్ని జమచేయాలని ఎన్జీటీ ఛైర్‌పర్సన్‌ జస్టిస్‌ ఆదర్శ్‌ కుమార్‌ గోయల్‌ గురువారం ఆదేశాలు జారీ చేశారు. ఫోక్స్‌వ్యాగన్‌ డీజిల్‌ కార్లలో ఉపయోగించే ఓ పరికరం కారణంగా పర్యావరణానికి తీవ్ర హాని కలుగుతోందని సంస్థపై ఉద్గారాల కేసు నమోదైంది. దీనిపై విచారణ చేపట్టిన ట్రైబ్యూనల్‌ నష్ట నివారణ చర్యల కింద కేంద్ర కాలుష్య నియంత్రణ మండలికి రూ.100కోట్లు జమ చేయాలని ఆదేశించింది.