రెండో టీ20 : టీం ఇండియా పరాజయం

SMTV Desk 2019-03-07 15:50:23  India Women vs England Women, 2nd T20I

గౌహతి, మార్చ్ 07: ఇండియా, ఇంగ్లాండ్ మహిళల జట్ల మధ్య మూడు టీ20 సిరీస్‌లో భాగంగా నేడు గౌహతి స్టేడియంలో జరిగిన రెండో టీ20లో టీం ఇండియా పరాజయ పాలైంది. 5 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ విజయం సాధించింది. మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ హీథర్ నైట్ బౌలింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత్ మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసి ఇంగ్లాండ్ కు 112 పరుగుల లక్ష్యాన్ని ముందుంచారు. ఇక క్రీజులోకి వెళ్ళిన ఇంగ్లాండ్ జట్టు 114/5 (19.1 Ovs)పరుగులు చేసి భారత్ పై విజయం సాధించారు. భారత్ మహిళల జట్టులో మిథాలీ రాజ్ 20, దీప్తి శర్మ 18, భారతి ఫుల్ మలి 18 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లు కేథరీన్ బ్రంట్ మూడు, లిన్ సే స్మిత్ రెండు, శ్రుబ్ సోలే, కాటే క్రాస్ ఒక్కొక్క వికెట్ల చొప్పున తీశారు.