వైరల్ వీడియో .. ప్రభాస్‌ తో సెల్ఫీ

SMTV Desk 2019-03-07 11:26:21  Prabhas, Prabhas selfie

అమ్మాయిలకు యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ అంటే ఎంత ఇష్టమో వేరే చెప్పనక్కర్లేదు. ప్రభాస్‌ సినిమా ఏదైన విడుదల అయితే చాలు.. థియేటర్ల క్యూలైన్లలో అబ్బాయిలతో సమానంగా ఉంటారు. ప్రభాస్‌ అంటే అమ్మాయిలకు అంత పిచ్చి. తాజాగా ప్రభాస్‌ కు తన అభిమానికి ఓ ఫన్నీ సంఘటన జరిగింది. లాస్‌ ఏంజిల్స్‌ ఇంటర్‌ నేషనల్‌ ఎయిర్‌పోర్టులో ప్రభాస్‌ ను చూసిన ఆనందంలో అభిమానులు ఆగలేకపోయారు. ఆయనతో ఒక్క సెల్ఫీ కోసం ఎగబడ్డారు. అందులో భాగంగానే ఓ యువతి సెల్ఫీ దిగేందుకు హీరో దగ్గరికి వచ్చింది. ఆయనతో సెల్ఫీ దిగి.. ప్రభాస్‌ చెంపపై చిన్నగా కొట్టి నవ్వుతూ వెళ్లిపోయింది. దాంతో ప్రభాస్‌ తన చెంపను రుద్దుకుంటూ చిన్నగా నవ్వుతూ మరో అభిమానికి సెల్ఫీ ఇచ్చారు. ఈ వీడియో వైరల్‌ అయింది. ప్రభాస్‌, తన అభిమాని మధ్య జరిగిన సీన్‌ ను చూసిన నెటిజన్లు తెగనవ్వేస్తున్నారు.

ప్రస్తుతం ప్రభాస్‌ ‘సాహో’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. సుజిత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్‌ సరసనగా బాలీవుడ్‌ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ నటిస్తున్నారు. ఇటీవలె ఆమె పుట్టినరోజు సందర్భంగా తుపాకి పట్టుకున్న వీడియోను ‘షేడ్స్‌ ఆఫ్‌ సాహో చాప్టర్‌ 2’ పేరుతో విడుదల చేశారు.