మహేష్ మహర్షి మళ్లీ వాయిదా..?

SMTV Desk 2019-03-07 11:21:40  mahesh

సూపర్ స్టార్ మహేష్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో మహేష్ 25వ సినిమాగా వస్తున్న మహర్షి సినిమా ఏప్రిల్ 25న రిలీజ్ కన్ఫాం అన్నారు. అయితే మళ్లీ మహర్షి వాయిదా పడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అనుకున్న టైం కల్లా షూటింగ్ పూర్తి కాకపోవడమే దీనికి కారణమని తెలుస్తుంది. ఏప్రిల్ 25 అనుకున్నది కాస్త మే 9న మహర్షి రిలీజ్ అవుతుందట.

అయితే మహేష్ సినిమాలకు మే నెల నెగటివ్ సెంటిమెంట్ ఏర్పడింది. ఎంత పెద్ద కాంబినేషన్ అయినా మే నెలలో మహేష్ సినిమా వస్తే అది మటాషే. రిలీజ్ ముందు అంచనాలు ఉన్నా మే నెలలో మహేష్ సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. అయితే ఈసారి దిల్ రాజు మాత్రం మహర్షి విషయంలో అలా జరిగే అవకాశమే లేదు అన్నట్టుగా డేర్ స్టెప్ తీసుకున్నారు. మే9న మహర్షి రిలీజ్ ఫిక్స్ చేయడానికి మరో కారణం ఈ సినిమాకు మరో ప్రొడ్యూసర్ అయిన అశ్వనిదత్ లాస్ట్ ఇయర్ మే 9న మహానటి సినిమా రిలీజ్ చేశారు. అది సూపర్ హిట్ అయ్యింది. అప్పట్లో జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా కూడా మే 9న రిలీజ్ చేశారు అశ్వనిదత్ సో ఇక్కడ హీరో నెగటివ్ సెంటిమెంట్ కన్నా నిర్మాత పాజిటివ్ సెంటిమెంట్ తో మహర్షి వస్తుందన్నమాట. మరి సినిమా ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.