JIPMERలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల

SMTV Desk 2019-03-06 18:03:03  Jawaharlal Institute Of Postgraduate Medical Education & Research, posts, jobs notifications

పుదుచ్ఛేరి, మార్చ్ 06: పుదుచ్ఛేరిలోని జవహర్‌లాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌రిసెర్చ్‌లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్‌, సంబంధిత పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

ఖాళీలసంఖ్య: 70 ఇందులో ప్రొఫెసర్‌-5, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌-55, లోయర్‌డివిజన్‌ క్లర్క్‌-10
అర్హతలు: ప్రొఫెసర్‌ పోస్టులకు పిజి లేదా ఎండి, ఎంఎస్‌, ఎంసిహెచ్‌, డిఎం, మాస్టర్‌ డిగ్రీలో ఉత్తీర్ణత. సంబంధిత విభాగం నుంచి పిజితోపాటు మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాలో సభ్యత్వం ఉండాలి. సంబంధిత టీచింగ్‌, రిసెర్చ్‌ రంగంలో అనుభవం ఉండాలి. లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌ పోస్టుకు ఇంటర్‌తోపాటు టైపింగ్‌,కంప్యూటర్‌ స్కిల్స్‌ ఉండాలి.
ఎంపికవిధానం: ఇంటర్వ్యూ ద్వారా,
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ద్వారా,
దరఖాస్తు ఆఖరుతేదీ: మే1.