ఎస్‌బ్యాంక్‌కు రూ.కోటి జరిమానా విధించిన ఆర్‌బీఐ

SMTV Desk 2019-03-05 17:26:14  yes bank, reserve bank of india, rbi, managing software, panjab national bank

న్యూఢిల్లీ, మార్చ్ 05: ప్రైవేటు రంగమైన ఎస్‌ బ్యాంక్‌కు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) గట్టి షాక్ ఇచ్చింది. పలు కీలక‌ నిబంధనలు పాటించనందుకు గాను ఆర్‌బీఐ ఎస్‌ బ్యాంక్‌కు జరిమాన విధించింది. పూర్తి వివరాల ప్రకారం...ఎస్‌ బ్యాంక్ స్విఫ్ట్‌ మెసేజింగ్‌ సాఫ్ట్‌వేర్‌ నిబంధనలు పాటించనందుకు గాను ఆర్‌బీఐ ఎస్‌ బ్యాంక్‌కు రూ.కోటి జరిమాన విధిస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రెగ్యులేటరీ ఫైలింగ్‌ సందర్భంగా ఈ జరిమానా విషయాన్ని ఎస్‌ బ్యాంక్‌ వెల్లడించింది. ఆర్థిక సంస్థలు లావాదేవీల కోసం అంతర్జాతీయ మెసేజింగ్‌ సాఫ్ట్‌వేర్‌ ఖస్విఫ్ట్‌గను వినియోగిస్తాయి. ఈ మెసేజింగ్‌ సాఫ్ట్‌వేర్‌ను దుర్వినియోగం చేయడం వల్ల పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో రూ.14,000 కోట్ల మోసం చోటుచేసుకుంది. పీఎన్‌బీ కుంభకోణం తర్వాత.. ఆర్‌బీఐ స్విఫ్ట్‌ నిబంధనలను కఠినతరం చేసింది. ఈ నిబంధనలు పాటించనందుకు గానూ ఎస్‌బీఐ సహా 8 బ్యాంకులపై ఇప్పటికే జరిమానాలను ఆర్‌బీఐ విధించింది.