మహేష్, రాజమౌళి 2020 ఫిక్స్..!

SMTV Desk 2019-03-05 16:50:41  mahesh rajamouli

సూపర్ స్టార్ మహేష్ దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో సినిమా గురించి కొన్నాళ్లుగా సిని ప్రేక్షకులంతా వెయిట్ చేస్తున్నారు. బాహుబలి తర్వాత ఆ సినిమాకు ఏమాత్రం తగ్గకుండా ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్నాడు జక్కన్న. ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి చేస్తున్న ఈ మల్టీస్టారర్ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక మహేష్ విషయానికొస్తే మహర్షి సినిమాతో ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

మహర్షి తర్వాత సుకుమార్ సినిమా ఉంటుందని తెలుస్తుండగా ఆ సినిమా తర్వాత అనీల్ రావిపుడి డైరక్షన్ లో మహేష్ మూవీ ఉంటుందని తెలుస్తుంది. ఆర్.ఆర్.ఆర్ పూర్తి కాగానే రాజమౌళి తన తర్వాత సినిమా మహేష్ తో చేస్తాడని తెలుస్తుంది. ఆర్.ఆర్.ఆర్ 2020 సమ్మర్ రిలీజ్ అంటున్నారు. అంటే ఆ ఇయర్ ఎండింగ్ లో మహేష్, రాజమౌళి సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. కె.ఎల్.నారాయణ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించనున్నారు.