ప్రారంభమైన 'డిస్కో రాజా' షూటింగ్

SMTV Desk 2019-03-05 15:29:18  Disco Raja, Raviteja, VI Anand, Payal Rajput

హైదరాబాద్, మార్చి 05: మాస్ మహారాజ రవితేజ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం డిస్కో రాజా . ఎస్‌.ఆర్‌.టి. ఎంటర్‌టైన్మెంట్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్, నభ నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వి.ఐ.ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు సంస్థ కార్యాలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం జరిగాయి. ముహూర్తపు సన్నివేశానికి రామ్‌ తాళ్లూరి కెమెరా స్విచ్ఛాన్‌ చేయగా, నిర్మాత రజనీ తాళ్లూరి క్లాప్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా రామ్‌ తాళ్లూరి మాట్లాడుతూ "మంగళవారం నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ఉంటుంది. వి.ఐ.ఆనంద్‌ చెప్పిన కథ అద్భుతంగా ఉంది. మా సంస్థ విలువను రెట్టింపు చేసే సినిమా అవుతుంది. పేరుకు తగ్గట్టు అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేస్తుంది. అత్యుత్తమ సాంకేతిక నిపుణులు ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు" అని తెలిపారు.